ఉజ్జయిని మహాకాళ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

అమరావతి: మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో “శ్రీ మహాకాల్ లోక్” కారిడార్ తొలిదశను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకుని ప్రధాని, మహాకాళుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కారిడార్‌ను ప్రారంభించారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పురాతన మహాకాళేశ్వర్ ఆలయ ఆవరణ అభివృద్ధి ప్రాజెక్టు తొలిదశ కింద రూ.856 కోట్లతో చేపట్టిన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఆలయంలో అభివృద్ధి చేసిన 900 మీటర్ల పొడవైన కారిడార్ అయిన ‘మహాకాల్ లోక్’ను.. భక్తులను ఆథ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లేవిధంగా తీర్చిదిద్దారు. విక్రమాదిత్యుడు ఈ ప్రాంతాన్ని పాలించాడు.ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు.
महाकाल महादेव महाकाल महा प्रभो,
महाकाल महारुद्र महाकाल नमोस्तुते।#ShriMahakalLok pic.twitter.com/JHQVtsweJC— Sambit Patra (@sambitswaraj) October 11, 2022