మురికివాడల నిర్వసితులకు ప్లాట్స్ అందించిన ప్రధాని

అమరావతి: అభివృద్ధి ఫలాలను అట్టడుగు స్థాయి ప్రజల వరకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నమని,వేలాది మంది మురికివాడల ప్రజలకు నేడు శుభదినమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.బుధవారం ఢిల్లీలోని కల్కాజీలో నివసిస్తున్న కుటుంబాలకు ప్రధాని ప్లాట్స్ ను పంపిణీ చేశారు. స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు కింద స్లమ్ క్లస్టర్ల నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు 3024 ప్లాట్లను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కావడంతో లబ్ధిదారులకు మోడీ ప్లాట్లను అందజేశారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఇన్-సీతు రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఫ్లాట్స్‌ను నిర్మించారు. అధునాతన సౌకర్యాలతో ప్రైవేటు కంపెనీలకు ధీటుగా ఈ ఫ్లాట్స్‌ను నిర్మించడం విశేషం.మొదటి దశలో భాగంగా మొత్తం 3024 ఫ్లాట్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఫ్లాట్ల నిర్మాణానికి మొత్తం రూ.345 కోట్ల ఖర్చు చేశారు. ఫ్లోర్ టైల్స్, సెరామిక్ టైల్స్, వంట గదిలో ఉదయ్‌పూర్ గ్రీన్ మార్బల్స్ వంటి అధునాత సౌకర్యాలను అందించారు. అంతేకాకుండా ఫ్లాట్స్ చుట్టూ కమ్యూనిటీ పార్క్ లు, ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్స్, మురిగి నీటి శుద్ధి కేంద్రం, లిఫ్ట్స్, మంచినీటి సరఫరా వంటి అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు.
అందరికీ సొంతింటి కలను నిజం చేయాలనే ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) ద్వారా 376 జుగ్గీ జోప్రీ మురికివాడల్లో పునరావసం కింద ఈ ఫ్లాట్లను నిర్మించి, ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.