మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల పథకం-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల అమలు జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి వికాస్ పథకంలో భాగంగా చేతివృత్తులతో జీవనోపాధితో పొందుతున్న వారికి చేయూత నివ్వాలన్నారు.ముఖ్యంగా ఉదయగిరిలోని చెక్కనగిషి కేంద్రం ద్వారా 300 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్న దృష్ట్యా ఆ భవన మరమ్మతులు, యంత్రాల సరఫరా కోసం అవసరమైన నిధులను సమకూర్చుడం కోసం త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. అక్కచెరువుపాడులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 480 సీట్లకు గాను 300 మంది విద్యార్థులు ఉన్నారని , ఆ పాఠశాలలో పూర్తిస్థాయిలో సీట్లను భర్తీ చేసి విద్యా వ్యాప్తికి తోడ్పడాలన్నారు.ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం క్రింద గురుకులాలు, పరిపాలనా భవనాలు, ఐటిఐ భవనాలు, వసతి గృహాల భవనాలు నిర్మాణం వంటి వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన 47 కోట్ల రూపాయలకు మరలా టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలన్నారు..ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీమతి కనకదుర్గ భవాని, మైనార్టీ కార్పొరేషన్ ED నారాయణ, ZP CEO శ్రీమతి వాణి,DEO రమేష్,,DRDA,డ్వామా, హౌసింగ్ PDలు సాంబశివరెడ్డి,తిరుపతయ్య, నరసింహం,డి MNHO ఓ డాక్టర్ పెంచలయ్య తదితరలు పాల్గొన్నారు.