రాష్ట్రం వ్యాప్తంగా పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి-ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్

నెల్లూరు: రాష్ట్రంలో జులై 5వ తేదీ పాఠశాలలు ప్రారంభించి 10 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు పాఠ్యపుస్తకాలు పాఠశాలకు అందించకపోవడాన్ని ప్రభుత్వం వైఫల్యంగా ఏబీవీపీ భావిస్తుందని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నలిశెట్టి రాజశేఖర్ చెప్పారు..బుధవారం నగరంలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు దందా అరికట్టాలని,,కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల వివరాలను తెలిపే విధంగా నోటీసు బోర్డ్ ఏర్పాటు చేసేలా DEO,MEO లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాఠశాల విలీనం చేసే జీవో నెంబర్ 117 ను ఏబీవీపీ ఖండిస్తోందని,,సదరు జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. హై స్కూల్ కేంద్రంగా ఒక కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూలోని 3,4,5 తరగతులు హైస్కూల్లో కలపడాన్ని ఏబీవీపీ ఖండిస్తుందన్నారు..1 తరగతి నుండి 8వ తరగతి వరకు తెలుగు మాధ్యంలోనే బోధన ఉండాలని,,ఏ మీడియాలో చదువుకోవాలి అనే అవకాశం విద్యార్థులకు వదిలేయాలి అని కోరారు..ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి సాయి,సహాయ కార్యదర్శి చందు, శ్రీను ,సాయి ,మూర్తి ,అరుణాచలం, సునీల్ తదితరులు పాల్గొన్నారు.