26 మంది VAOలకు VROలుగా ప్రమోషన్

నెల్లూరు: జిల్లాలో 26 మంది గ్రామ రెవెన్యూ సహాయకులకు గ్రామ రెవెన్యూ అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా కలెక్టర్ బాబు శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.. 2012లో నియామకం పొందిన VAOలు, కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు అందుకుని గురువారం VRO లుగా విధుల్లో చేరారు..ఈ సందర్భంగా వారు పదేళ్లుగా VRO పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న తమకు పదోన్నతి కల్పించడం చాలా సంతోషంగా ఉందని అందుకు జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.