x
Close
DISTRICTS

పర్యావరణ సమతుల్యత కాపాడండి-మేయర్, కమిషనర్

పర్యావరణ సమతుల్యత కాపాడండి-మేయర్, కమిషనర్
  • PublishedSeptember 7, 2022

నెల్లూరు: వాయుకాలుష్యానికి కారణమయ్యే కర్బన ఉద్గారాల వినియోగంపై ప్రజలంతా చైతన్యం పెంచుకుని పర్యావరణ సమతుల్యతను కాపాడాలని నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ స్రవంతి, కమిషనర్ హరితలు పిలుపునిచ్చారు. బుధవారం భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు ( Environment,Forest & Climate Change) మంత్రిత్వ శాఖ జాతీయ,,రాష్ట్ర,,పట్టణ స్థాయిలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన నిర్విహించే  International Day Of “Clean Air For Blue Skies” (నిర్మల ఆకాశము కొరకు స్వచ్ఛ వాయువులు)లో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక V.R.C కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో స్వచ్ఛమైన వాయు పరిస్థితులను పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ వ్యర్ధాలను, పోగుపడిన చెత్తను తగలబెట్టడం మానుకోవాలని, అనవసరంగ ఏ.సి వాడకాన్ని తగ్గించాలని సూచించారు.ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలని,, పర్యావరణ పరిరక్షణపై పౌరులంతా బాధ్యతతో భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఈ ర్యాలీలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు నీలి రాఘవ రావు, బూడిద సుప్రజ, కో ఆప్షన్ సభ్యులు మొబీనా, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ రాజశేఖర్, ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ సంజయ్, ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయం కార్యదర్శులు, నగర పాలక సంస్థ ఇండోర్, ఔట్ డోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.