NATIONAL

3 సంవత్సరాల్లో 7 కోట్ల గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించం-ప్రధాని నరేంద్ర మోడీ

హర్ ఘర్ జల్ జీవన్ మిషన్..

అమరావతి: హర్ ఘర్ జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా 3 సంవత్సరాల్లో 7 కోట్ల గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.. శుక్రవారం ప్రధాని మోదీ గోవాలో హర్ ఘర్ జల్ ఉత్సవ్ లో వర్చువల్ విధానంలో పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల్లో కేవలం 3 కోట్ల గ్రామాలకు మాత్రమే పైప్ లైన్ ద్వారా మంచినీళ్లు ఇచ్చారని తెలిపారు..దేశం గురించి పట్టించుకోని వ్యక్తులు,,దేశ వర్తమానం,,భవిష్యత్ గురించి కూడా పట్టించుకోరన్నారని,, ఒక దేశాన్ని అన్ని రంగాల్లో నిర్మించడం అంత సులభం కాదన్నారు..ఎక్కడైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని,,అయితే దేశాన్ని నిర్మించడానికి కఠోర శ్రమ తప్పనిసరి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు..తాము దేశంను అన్ని రంగాల్లో నిర్మించే మార్గాన్ని ఎంచుకున్నామన్నారు.. అందుకే తాము ప్రస్తుత,,భవిష్యత్తు సమస్యలను,,సవాళ్ళను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు..గోవాలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అన్ని కుటుంబాలకు ఇంటింటికీ మంచి నీటిని అందజేయాలన్న లక్ష్యం సాకారమైనందుకు రాష్ట్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది..

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *