AMARAVATHITECHNOLOGY

ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన PSLV,C-55 రాకెట్

అమరావతి: తిరుపతి జిల్లా, శ్రీహరికోట నుంచి PSLV,C-55 రాకెట్ 26 గంటల కౌంట్‌డౌన్‌ తరువాత సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్‌-2, 16 కిలోల లూమ్‌లైట్‌-4..టెలియోస్‌-2 ఉపగ్రహం సింగపూర్‌ ప్రభుత్వానికి చెందినది..ఇది సముద్రంలో నేవిగేషన్ అవసరాల కోసం వివిధ ఏజెన్సీల వినియోగించనున్నారు..లూమ్‌లైట్‌-4 ఉపగ్రహాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫోకామ్‌ రీసెర్చ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లోని శాటిలైట్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కలిసి అభివృద్ధి చేశాయి.. సింగపూర్‌ ఇ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చనుంది.. PSLV,C-55 రాకెట్ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైనదని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ వెల్లడించారు..త్వరలో చంద్రయాన్-3, మిషన్ ఆదిత్య లాంటి అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *