x
Close
DISTRICTS

భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి-కమిషనర్ శ్రీమతి హరిత

భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి-కమిషనర్ శ్రీమతి హరిత
  • PublishedNovember 1, 2022

విపత్తు నిర్వహణకు టోల్ ఫ్రీ నెంబర్లు..

నెల్లూరు: నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని,ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు నగర పాలక సంస్థ సిద్ధంగా ఉందని కమిషనర్ శ్రీమతి హరిత తెలిపారు. భారీ వర్షాలకు నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రధాన డ్రైను మార్గాలు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలు, అండర్ బ్రిడ్జ్ ల పరిస్థితిని అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాల నేపధ్యంలో కార్పొరేషన్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నామని తెలిపారు. వర్షాల నేపధ్యంలో సమస్యలు కలిగినవారు 18004251113, 0861 230 1541 నెంబర్లకు సమాచారం అందించి తగిన సహాయం పొందాలని కమిషనర్ తెలిపారు. రహదారులు, రోడ్లు, అండర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు మోటార్ల ద్వారా తోడివేస్తున్నామని,పాదచారులు, వాహన చోదకులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రధాన ప్రాంతాలలో అధికారులు పర్యవేక్షిస్తున్నారని కమిషనర్ వెల్లడించారు.వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ప్రజలు భారీ వృక్షాల సమీపంలో నిలవడం, విద్యుత్ స్థంబాలను తాకడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని కమిషనర్ సూచించారు. వరద నీరు పెరుగుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు కార్పొరేషన్ సూచించిన టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.