x
Close
NATIONAL

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ పరీక్షలు విజయవంతం

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ పరీక్షలు విజయవంతం
  • PublishedSeptember 8, 2022

హైదరాబాద్: క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ (QRSAM ) వ్యవస్థ పరీక్ష విజయవంతం అయింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)  నుంచి డిఆర్డీవో, భారత ఆర్మీ సంయుక్తంగా QRSAM  పరీక్షను నిర్వహించినట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వెల్లడించింది..అత్యాధునిక సాంకేతికతతో రూపొందించి ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో గాలిలో ఉన్న మరో అబెక్ట్ ను కూల్చివేయగలదు.. సరిహద్దుల్లో శత్రుదేశాల విమానాలు, డ్రోన్లను గుర్తించి కూల్చివేయడంలో QRSM క్యూర్ కీలకంగా మారనున్నది.. QRSAM సిస్టమ్ కు సంబంధించిన 6 విమాన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు DRDO ప్రకటించింది..ఫైనల్ టెస్ట్ ట్రయిల్స్ లో భాగంగా స్వదేశీ ఆర్‌ఎఫ్‌ సీకర్‌, మొబైల్ లాంచర్, పూర్తిగా ఆటోమేటెడ్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్, నిఘా, మల్టీ ఫంక్షన్ రాడార్‌లతో కూడిన క్షిపణితో సహా స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన అన్ని సబ్‌ సిస్టమ్స్‌ను ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు..ఈ మిస్సైల్‌ ఓ షార్ట్‌ రేంజ్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌ సిస్టమ్‌. ఈ మిస్సైల్‌ 30 కిలోమీటర్ల పరిధిలో పది కిలోమీటర్ల ఎత్తులో గాలిలో ఎరిగే లక్ష్యాలను కూడా ఛేదించగలదు. అన్ని వేళల్లో QRSAM  పనితీరును పరీక్షించారు..గగనతల రక్షణ వ్యవస్థకు QRSAM  కీలకంగా మారనున్నది..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.