బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీ చేస్తున్నాను-సునాక్

అమరావతి: భారతీయ సంతతీకి చెందిన బ్రిటన్ ఎంపీ రుషి సునాక్,బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తనకు 100 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతు ఉందని ఆయన వెల్లడించిన అయన, ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, పార్టీని సమైక్యపరచి, దేశానికి సేవలందించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. రుషి సునాక్ ఆదివారం చేసిన ట్వీట్‌లో, యునైటెడ్ కింగ్‌డమ్ గొప్ప దేశమని, ప్రస్తుతం దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, అందుకే తాను కన్జర్వేటివ్ పార్టీ నేత, ప్రధాన మంత్రి పదవులకు పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, పార్టీని సమైక్యపరచి, దేశానికి సేవలందించాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.