x
Close
HYDERABAD

బీజేపీ క్రమశిక్షణ సంఘానికి వివరణ లేఖ రాసిన రాజాసింగ్

బీజేపీ క్రమశిక్షణ సంఘానికి వివరణ లేఖ రాసిన రాజాసింగ్
  • PublishedOctober 10, 2022

హైదరాబాద్: బీజేపీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీసుకు ఎమ్మెల్యే రాజాసింగ్ వివరణ ఇస్తూ, బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని క్రమశిక్షణ కమిటీకి ఆయన లేఖ రాశారు. తాను ఎక్కడ పార్టీ నిబంధనలను అతిక్రమించలేదని, ఏ మతాన్ని కించపర్చలేదని లేఖలో పేర్కొన్నారు. మునావర్ ఫారుఖీ షో సందర్భంగా తాను విడుదల చేసిన వీడియోపై, టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ప్రక్కదారి పట్టించి తప్పుడు కేసు పెట్టాయని,సదరు కేసును కోర్టు డిస్మిస్ చేసిందన్నారు. మునావర్ ఫారుఖీని అనుకరిస్తూ తాను ప్రసంగించానని, ఏ మతాన్నిలేదా వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించారు. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నానని ఆ లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు. ఎంఐఎం విధానాలను ప్రశ్నిస్తే ముస్లింలను తిడుతున్నట్లుగా వక్రీకరిస్తున్నారని, తనపై 100కు పైగా తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. మునావర్ ఫారుఖీ షో రోజు తనతో పాటు 500 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని వెల్లడించారు. తానెక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, పార్టీలో కొనసాగుతూ బీజేపీకి, దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నాట్లు సమాచారం?

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *