చైనాలో 40 వేల థియేటర్‌లలో విడుదల కానున్న రామ్‌గోపాల్ వర్మ చిత్రం లడ్‌కీ

రెండు దశాబ్ధాల కల ఇది..
హైదరాబాద్: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అంటేనే, వివాదాలు,కట్టె విరిచిపెట్టినట్లుగా వుండే ట్వీట్లు..అలాంటి వర్మదర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “లడ్‌కీ” మార్షల్ ఆర్ట్స్ ను కథాశంగా తీసుకుని రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో “అమ్మాయిగా”విడుదల చేయనున్నారు..ఈ చిత్రంను తమిళ, మలయాళ, కన్నడ భాషలతోపాటు చైనాలోనూ విడుదలకు సిద్దం చేస్తున్నారు.. చైనీస్‌లో “గర్ల్ డ్రాగన్” పేరుతో దాదాపు 40000 థియేటర్‌లలో విడుదల చేయడానికి వర్మ సన్నాహాలు చేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన నిర్మాణ సంస్థ ARTSEE MEDIA and Chinese company BIG PEOPLE సంస్థతో కలిసి రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 15వ తేదిన విడుదల కానుంది.. చైనాలో దంగల్ 9000,,సీక్రెట్ సూపర్‌స్టార్ 12000,,బాహుబలి 6000 చిత్రాలు థియేటర్‌లలో విడుదల కాగా, “లడ్‌కీ” చిత్రం మాత్రం 40000 థియేటర్‌లలో విడుదల కానున్నట్లు చిత్రనిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి.. భారతదేశ చలన చిత్రరంగం చరిత్రలోనే ఈ స్థాయిలో చైనాలో విడుదల చేయడం తొలిసారి..ఈ చిత్రంలో కథానాయికీగా నటించిన “పూజా బాలేకర్ టైక్వాండో నేషనల్ ఛాంపియన్”..అయినప్పటికీ ఈ చిత్రంలో కథాశంకు అవసరం కావడంతో, చైనాలోని షావోలిన్ టెంపుల్‌లో శిక్షణ పొందిన నిపుణుల పర్యవేక్షణలో బ్రూస్‌లీ స్టైల్ అయినటువంటి “జీత్ కునేడో”లో శిక్షణ పొందింది..బ్రూస్‌లీ పట్ల నాకున్న అభిమానంతో తీసిన చిత్రమిది. రెండు దశాబ్ధాల కల ఇది’’ అని ఆర్‌జీవీ ట్వీట్ చేశారు.