హైదరాబాద్: అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులు జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్‌ను కలిశారు.గత సంవత్సరం వరదల వల్ల డ్యామ్ కొట్టుకుపోవడంతో బాధితులు సర్వం కోల్పోయారు. డ్యాం కొట్టుకుపోయినప్పుడు లస్కర్ రామయ్య ప్రజలను కాపాడాడు. జనసేన తరఫున రామయ్యకు రూ.21 లక్షలు ఆర్థిక సాయం అందచేశారు.ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన బాక్సర్ వంశీకృష్ణకు రూ.50 అందచేశారు.జాతీయస్థాయిలో క్రీడాకారులు నష్టపోతుంటే ప్రభుత్వం శ్రద్ద తీసుకోవడంలేదని మండిపడ్డారు. సజ్జల.రామకృష్ణారెడ్డి ఉగ్రవాద పార్టీకి సలహాదారుగా వున్నరని, ప్రత్యర్థి పార్టీల నేతలను చంపేస్తామంటే ఖండించాలని సూచించారు.అలా ఖండించకుంటే వైసీపీని ఉగ్రవాద పార్టీగా భావించాల్సి ఉంటుందన్నారు. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేసే పద్దతి మాఫీయా ముఠా సంస్కృతిదని,,ఈలాంటి సంస్కృతి రాయలసీమ కాదన్నారు.