భారత్ తో చర్చలు జరిపేందుకు సిద్ధం-కశ్మీర్ లో పరిణామాలను మాత్రం ఆపాలి-పాక్ ప్రధాని

అమరావతి: ఒక వైపు భారతదేశంలోకి ఉగ్రమూకలను పంపించి,,మరణకాండ సృష్టిస్తూన్న శత్రుదేశమైన పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది..అక్కడి ప్రజలు తినడానికి గోదుమ పిండి దొరకని పరిస్థితి,,నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయాయి..పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వంపైకి తిరగబడుతూన్నారు..దింతో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆర్థిక సాయంచేయాంటూ ప్రపంచదేశాలను అడ్కుకొవాల్సిన దుస్థితి ఏర్పాడింది అంటూ వ్యాఖ్యనిస్తున్నారు.. ఈ క్రమంలో ఆయన ఆల్ అరేబియా టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు..భారత ప్రధాని మోదీతో చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని,, పాక్‌కు శాంతి కావాలని,, కానీ కశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలను ఆపాలని షెహబాజ్ కోరారు.. భారత్‌తో మూడు యుద్ధాలు చేశామని,, అయితే ఆ యుద్ధాలవల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగిందని, మేం గుణపాఠం నేర్చుకున్నామని, ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు..తమ వద్ద ఇంజనీర్లు, వైద్యులు, నైపుణ్యంఉన్న కార్మికులు ఉన్నారు..భారత్‌తో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొనేందుకు భారత నాయకత్వానికి, ప్రధాని మోదీకి నేను విజ్ఞప్తి చేస్తున్నానని షాబాజ్ షరీఫ్ అన్నారు..మన వనరులను బాంబులు,,గన్ పౌడర్‌ల తయారీలో ఖర్చుచేయడం పాకిస్థాన్‌కు ఇష్టం లేదని షాబాబ్ పేర్కొన్నాడు..మరో వైపు నేపాల్ ద్వారా ఉగ్రవాదులను యధేచ్చగా భారత్ లోకి చొప్పించి,,విధ్వసం సృష్టించేందుకు ప్రయత్నాలను మాత్రం కొనసాగుతునే ఉన్నాయి..శాంతి కోసం మాజీ ప్రధాని వాజ్ పేయ్ బస్సు యాత్ర చేస్తే,,కార్గిల్ యుద్దంతో భారత్ లోని ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు యత్నించిన విషయం భారతీయులకు గుర్తు వుండే వుంటుంది..