నేటినుంచి ఓటర్ల అభ్యంతరాల స్వీకరణ-కమిషనర్ శ్రీమతి హరిత

నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, మార్పు చేర్పుల వివరాలను నేటి నుంచి డిసెంబర్ నెల 8వ తేదీ వరకు చేపట్టనున్నామని కమిషనర్ శ్రీమతి హరిత తెలియజేసారు. స్థానిక E.S.R.M పాటశాలలో స్పెషల్ సమ్మరీ రివిజన్-2023 కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించి డ్రాఫ్ట్ ఎలెక్టోరల్ రోల్ పబ్లికేషన్ ను విడుదల చెసారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచించారు. నూతన ఓటర్ల నమోదుపై ప్రజలంతా అవగాహన పెంచుకుని ఓటరు నమోదుకు ప్రోత్సహించాలని కోరారు. అనంతరం నూతనంగా రూపొందించిన ఓటరు లిస్టును ప్రజలకు చదివి వినిపించారు. నూతన ఓటరు లిస్టును అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిర్మలానంద బాబా, డిప్యూటీ తహశీల్దార్ శైలజా కుమారి, బి.ఎల్.ఓ సూపర్వైజర్ కృష్ణ కిషోర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.