MLC ఉపాధ్యాయ ఎన్నికల కోసం దొంగ ఓట్లు నమోదు?-అభ్యర్దులు

నెల్లూరు: తూర్పు రాయలసీమ MLC ఉపాధ్యాయ ఎన్నికల కోసం అధికార పార్టీ అభ్యర్థులు, కార్పొరేట్ యాజమాన్యాలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాయని, నెల్లూరు అర్బన్ MRO ఆఫీసులో దొరికిన వందలాది అప్లికేషన్లు ఇందుకు నిదర్శనమని టీచర్స్ MLC PDF అభ్యర్థి పి.బాబు రెడ్డి, ప్రజా సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎం.మోహన్ రావు,తదితరులు మంగళవారం గాంధీ బొమ్మసెంటర్ లో నిర్వహించిన ధర్నాలో ఆరోపించారు.దొంగఓట్ల నమోదపై శనివారం స్థానిక VRC సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహాం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో APTF,రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్,బహుజన టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి అభ్యర్ది N.C నరసింహరెడ్డి ఆరోపించారు.ఈ సదంర్బంలో అయన మాట్లాడుతూ DEO కార్యాలయంలో కార్పొరేట్ సంస్థల అప్లికేషన్లు రాత్రి 8 గంటల సమయంలో కౌంటర్ సంతకాలు చేయడం,కృష్ణ చైతన్య విద్యా సంస్థల AGM ఇంటికి DEO వెళ్లి సంతకాలు పెట్టడం సిగ్గుచేటని, ఇది అధికార పార్టీ అక్రమాలకు పరాకాష్ట అని,RJD, జిల్లా ఇన్చార్జి DEO సుబ్బారావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.