హైదరాబాద్: రెండు వర్గాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాత మలక్‌పేటకు చెందిన MIM నాయకుడు సయ్యద్ అబ్దుల్ ఖాద్రీ(కషఫ్) పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.మంగళవారం ఖాద్రీ అలియాస్ కషఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యల తరువాత ఆ వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసి,,ఉద్రిక్తతలు సృష్టించేందుకు కషఫ్ ప్రయత్నించాడని పోలీసులు FIRలో పేర్కొన్నారు. కషఫ్ వ్యాఖ్యలతో పాతబస్తీలో వివిధ ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని తెలిపారు.సయ్యద్ ఖాద్రీని ఏడాది పాటు జైల్లోనే ఉంచనున్నారు.ఈ నెల 23న బషీర్‌బాగ్ సీపీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలోనూ కషఫ్ కీలకపాత్ర పోషించాడని పోలీసులు పేర్కొన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజాసింగ్ చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నారు.