నేను కాని నొరు విప్పితే,అడ్రస్సు కూడా దొరకవూ గుర్తుంచుకో-రూప్ కుమార్
నెల్లూరు: నగరంలోని వైసీపీ మధ్య వున్న అంతర్గత విభేధాలు ఒక్క సారి భగ్గుమన్నాయి..మునిసిపాల్ కార్పొరేషన్ డిప్యూటి మేయర్ రూప్ కుమార్ అనుచరుడిగా కొనసాగుతున్న వైసీపీ విద్యార్ది విభాగం రాష్ట్ర కార్యదర్శి కొనసాగుతున్న షేక్.అబ్దుల్ హాజీ తనపై శుక్రవారం రాత్రి హాత్య యత్నం జరిగిందని ఆరోపించారు.శనివారం ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని పరామర్శించిన రూప్ కుమార్ మీడియా సమావేశంలో సీటీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ పై పరోక్షంగా తీవ్రస్థాయిలో మండిపడుతూ హెచ్చరికలు చేశారు.నేను తయారు చేసిన బొమ్మవి,,నాకు మొత్తం తెలుసు..చెప్పుతినుడు కుక్క చెరుకు తీపిఎరుగునా…అంటూ సామెత గుర్తు చేశారు..రాజకీయ నాయకులపైన భౌతికంగా దాడి చేసే సంస్కృతి నగరంలో ఇటీవలే ప్రారంభం అయింది…నేను కనుక తిరిగి దాడి మొదలు పెడితే తట్టుకోలేవు..కెమోరాల ముందు ఒక మాట తెర వెనుక చేసేది ఇలాంటి నీచమైన పనులు అంటూ మండిపడ్డారు.. కిరాయి మూకలకు డబ్బులు ఇచ్చి దాడులు చేయించడాని సహించేది లేదంటూ ఘాటుగా హెచ్చరించారు..