13వ డివిజన్ లో అక్రమ నిర్మాణాల తొలగింత

నెల్లూరు: నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన స్థానిక 13వ డివిజను సర్వే నెం 599 రు లోని 14 కట్టడాలలో గతంలో 13 వాటిని తొలగించారు. శుక్రవారం నాడు చివరి నిర్మాణాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో జె.సి.బి సహాయంతో అక్రమ నిర్మాణాన్ని తొలగించడంతో పాటు సర్వే నెం 607 రు కాలువ ఆక్రమణ ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది, సచివాలయం వార్డు ప్లానింగ్ సెక్రటరీ పాల్గొన్నారు.