తిరుపతి నగరంలో నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు-ఎమ్మెల్యే భూమన

తిరుపతి: వ్యక్తిగత స్వార్థ రాజకీయాలకు తావు లేకుండా మీ న్యాయమైన కోరిక, మీ జీవితాల భద్రత దృష్టిలో ఉంచుకొని మీ ప్రాంత స్థలాలను నిషేధిత జాబితా నుండి తొలగింపుపై సీ.ఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరిగిందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక 45 వ వార్డు జీవకోన ముత్తు మారెమ్మ గుడి వద్ద సంబంధిత స్థలాల నిషేధిత జాబితా నుంచి తొలగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ గత పాలకులు 2018లో ఉద్దేశపూర్వకంగా మీకు సంబంధించిన ఆస్తులను నిషేధిత జాబితాలో ఉంచారని మీరు తెలియజేసిన అభ్యర్థనల మేరకు ముఖ్యమంత్రితో చర్చించి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. 45వ వార్డుకు సంబంధించిన శివ జ్యోతి నగర్ , అయ్యప్ప కాలనీ, ప్రగతి నగర్ , భూపాల్ నగర్ లోని 695/2 నుండి 700/ 1 బి 2 సర్వేనెంబర్లలో 36.10 ఎకరాల్లో నివాసముంటున్న 950 కుటుంబాలకు లబ్ధి కలిగేలా వారి స్థలాలను నిషేధిత జాబితా నుండి తొలగించి కంప్యూటర్ బటన్ నొక్కి రిజిస్ట్రేషన్ జరిగేలా అవకాశం కల్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేడు చట్టబద్ధతగా 22A నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నామన్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ సౌకర్యం కలుగుతుందని తెలిపారు. నేడు గత 40 సంవత్సరాల కిందటి స్వాతంత్ర సమరయోధుల భూములైన 36.10 ఎకరాలను నిషేధిత జాబితా నుండి తొలగించామని, మరో 38 ఎకరాలు ప్రభుత్వ భూముల సంబంధించినది మరో 30 రోజుల్లోపరిష్కరిస్తామని, OTS విధానంతో రిజిస్ట్రేషన్ ల సౌకర్యం కల్పిస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,జిల్లా అధికారులు పాల్గొన్నారు.