హిందు దేవుళ్ల స్టిక్కర్లను తొలగించడం దారుణం-ఎమ్మేల్యే రాజాసింగ్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహరశైలీతో తిరుపతికి చెడ్డపేరువస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు..తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి ప్రతి రోజు వేలాది మంది భక్తులు వస్తారని,,తిరుపతి అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు..మహారాష్ట్ర భక్తులు తెస్తున్న శివాజీ విగ్రహాలను అనుమతించమని పోలీసులు పేర్కొనడం దారుణమన్నారు..శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం మహారాష్ట్రలో పెద్ద సమస్య అయిందని,,మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయ్ కాట్ తిరుపతి అని పోస్టు వైరల్ అవుతోందన్నారు..సీ.ఎం జగన్,,టీటీడీ ఛైర్మన్ల తప్పుడు నిర్ణయాలే ఈ వివాదానికి కారణని,,ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని డిమాండ్ చేశారు..