విద్యాహక్కు చట్టం అమలు చేయని కార్పొరేట్ సంస్థలపై ?-PAAP

హైకోర్టు కోర్టు ఆదేశాన్ని ఆమలు చేయకపోతే..?
నెల్లూరు: ప్రైవేటు విద్యాసంస్థల్లో RTE-2009 విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసేందుకు గరిష్ట ఫీజులు 15000 రూపాయలుగా,,25 శాతం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించారని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకులు మలిరెడ్డి.కోటారెడ్డి,,శిఖరం.నరహరిలు తెలిపారు..జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసేందుకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యానికి అత్యవసరంగా నోటీసులు జారీ చేయాలని,,అలాగే చర్యలు తీసుకోవడంతో పాటు ఫీజులు,25 శాతం ఆర్థిక,సామాజిక వెనుకబడిన (SC,ST,BC,OBC,EWS, MINORITY విద్యార్థులు) రిజర్వేషన్ల నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వుల కాపీని రాష్ట్రంలోని ప్రతి ప్రైవేటు విద్యాసంస్థల నోటీసు బోర్డుపై ఉంచే విధంగా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు..ఇదే సమయంలో ప్రభుత్వానికి చట్టాల అమలు ఎంత బాధ్యత ఎంత వుందో,,అలాగే ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆ చట్టాల అమలు చేయించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల అంతే వుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు..చట్టంను అతిక్రమించి ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలను విద్యార్థి తల్లిదండ్రులు నిలదీయాలని కోరారు.. ప్రభుత్వ చట్టాలు అమలు చేయకపోయినా? సంబంధితన కార్పొరేట్ విద్యసంస్థలు, హైకోర్టు కోర్టు ఆదేశాన్ని ఆమలు చేయకపోతే జిల్లా కలెక్టర్ కి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు..