బ్రిటన్ ప్రధాని రేసు,రెండో దశ ఎన్నికలో అధిక్యంలో రిషి సునాక్

అమరావతి: బ్రిటన్ ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ మరోసారి ముందంజలో నిలిచారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవి కోసం గురువారం నిర్వహించిన రెండో దశ ఎన్నికలో అత్యధికంగా 101 మంది ఎంపీలు సునాక్‌కు మద్దతు తెలిపారు..రెండో రౌండ్లో సునాక్ తర్వాత.. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ (83 ఓట్లు), విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ (64 ఓట్లు), మాజీ మంత్రి కెమీ బదెనోచ్ (49 ఓట్లు), టోరీ బ్యాక్‌బెంచర్ టామ్ తుగెన్‌ధాట్ (32 ఓట్లు) వరుసగా నిలిచారు. వీరంతా వచ్చే వారం జరగబోయే తదుపరి రౌండ్లో పోటీ పడనున్నారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి ఆటార్నీ జనరల్ సుయెలా బ్రావెర్మన్.. రెండో రౌండ్లో 27 ఓట్లు రావడం వల్ల పోటీ నుంచి నిష్క్రమించారు..ప్రజలపై పన్ను భారాన్ని తగ్గిస్తానని వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇవన్నీ చెప్పటం లేదన్నారు..ప్రజలను పేదరికంలో నెట్టేస్తున్న ద్రవ్యోల్బణమే తన శత్రువని స్పష్టం చేశారు..2024లో పార్లమెంటు ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీని ఓడించగల సమర్థుడైన నాయకుడు తానేనని ధీమా వ్యక్తంచేశారు..