ఇమామ్ల సంఘం కార్యాలయంకు వెళ్లిన RSS అధినేత మోహన్ భగత్

అమరావతి: RSS చీఫ్ మోహన్ భగవత్,ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీతో గురువారం సమావేశం అయ్యారు. కస్తూర్బా గాంధీ మార్గ్లోని మసీదుకు చేరుకున్నారు.RSS సంయుక్త ప్రధాన కార్యదర్శి కృష్ణ గోపాల్, సీనియర్ నేత రామ్ లాల్, ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేత ఇంద్రేశ్ కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరంతా కలిసి గంటపాటు ఇల్యాసీతో చర్చలు జరిపారు.అనంతరం మదర్సాను సందర్శించిన RSS చీఫ్, అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు..అఖిల భారత్ ఇమామ్ల సంఘం అధినేత ఉమర్ అహ్మద్ ఇల్యాసీతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సారథి మోహన్ భగవత్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మోహన్ భవగత్ తో భేటీ అనంతరం ఇలియాసీ మీడియాతో మాట్లాడారు. మనందరిదీ ఒకే DNA అని, అయితే దేవుణ్ని పూజించే విధానం మాత్రమే భిన్నంగా ఉంటుందన్నారు.ఈ సమావేశంపై స్పందించిన ముస్లిం మతపెద్దలు.. ఇది దేశానికి మంచి సందేశాన్ని పంపుతుందని అభిప్రాయపడ్డారు. తామంతా కుటుంబ సభ్యుల్లా చర్చించామని, తమ ఆహ్వానాన్ని మన్నించి మోహన్ భగవత్ తమను కలిసేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. మత సామరస్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మోహన్ భగవత్ ముస్లింపెద్దలను కలిశారని RSS ప్రకటించింది.”అన్ని రంగాల వ్యక్తులతో RSS అధినేత సమావేశం అవుతూ ఉంటారు. సాధారణ ‘సంవాద్’ ప్రక్రియలో ఇది భాగం” అని RSS ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు.