బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన రుషి

అమరావతి: లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంకు భారత సంతతికి చెందిన రుషీ సునాక్ రూపంలో పరిష్కరం లభించింది. రిషి సునాక్ ఏకగ్రీవంగా కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షపదవీకి ఎన్నికైనట్లు ప్రకటించారు. బ్రిటన్ ప్రధాన పదవి చేపట్టిన భారత సంతతికి చెందిన తొలి వ్యక్తిగా సునాక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టేందుకు 100 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు అవసరం కాగా, రిషి సునాక్ కు 193 మంది ఎం.పిలు సపోర్ట్ చేశారు.తాను అధికారంలో చేపడితే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బొరిస్ జాన్సన్ బరి నుంచి తప్పుకోవడంతో పెన్నీ మోర్డాంట్ ఒక్కరే రిషి సునాక్తో పోటీ పడ్డారు.అయితే అమెకు కేవలం 26 మంది ఎం.పిల మద్దతు వుండడంతో,అమె పోటీ నుంచి తప్పుకున్నారు. భారతీయులపై నోరు పారేసుకున్న బ్రిటన్ మాజీ హోం మంత్రి కార్యదర్శి సుయెల్లా బ్రేవర్మన్ సైతం తప్పనిసరి పరిస్థితిలో రిషి సునాక్ కు మద్దతు ప్రకటించారు.