ఆత్మహుతి దాడికి సిద్దమౌవుతున్న ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన రష్యా

అమరావతి: భారత్లో ఉగ్రదాడి ద్వారా కేంద్రంలో ఓ కీలక నేతను హత్య చేసేందుకు సిద్దమౌవుతున్న ISISకు చెందిన ఉగ్రవాదిని రష్యా ఫెడరల్ సెక్యూర్టీ సర్వీస్(FSB) అరెస్ట్ చేసింది..రష్యా న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ పేర్కొన్న వివరాల ప్రకారం ISISకు చెందిన ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఓ దేశానికి చెందినవాడని,,తనను తాను పేల్చుకుని భారత్లో అధికారంలో ఉన్న ఒక ముఖ్యమైన రాజకీయ నేతను హతమార్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది.ఆ సూసైడ్ బాంబర్ను టర్కీలో ISIS రిక్రూట్ చేసుకున్నట్లు పేర్కొంది.. ISIS తోపాటు దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది..ఈ సంస్థలను భారతదేశ వ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని మొదటి షెడ్యూల్ లో చేర్చింది. ISIS సోషల్ మీడియాలో తన భావజాల వ్యాప్తికి ప్రయత్నిస్తోంది..దింతో ఆప్రమత్తంగా వున్న కేంద్రం యాంటీ సైబర్ సెల్,ఈలాంటి యాక్టివిటీస్ పై గట్టి నిఘా పెంచాయి..