ఉక్రెయిన్ క్షిపణి దాడులకు ధీటుగా జిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణులను సిద్దం చేస్తున్న రష్యా

అమరావతి: 400 కీ.లో మీటర్ల దూరంలో లక్ష్యాలను చేధించే,అత్యాధునిక జిర్కాన్ 3M22 హైపర్ సోనిక్ క్షిపణులతో పాటు పలు ఆయుధాలను ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద రష్యా సిద్దం చేస్తొంది..ఉక్రెయిన్ క్షిపణి దాడులు చేయడంతో రష్యా సైనికులు ఇటీవల పెద్ద సంఖ్యలో మృతి చెందిన విషయం విదితమే..ఉక్రెయిన్ దాడులకు జవాబులగా, అడ్మిరల్ గోర్ష్కోవ్ యుద్ధనౌక రష్యాలోని ఓ పోర్టు నుంచి ఉక్రెయిన్ సరిహద్దులు ఉండే సముద్రతలం వైపునకు బయలుదేరిందని ఓ ఎజెన్సీ పేర్కొంది..నేవల్ వింగఖ కమాండర్.. రక్షణ మంత్రి సెర్గేయీ షోయిగూలతో, రష్యా అధ్యక్షుడు పుతిన్ బుధవారం పలు విషయాలపై పలు ఆదేశాలు ఇచ్చారు.. అడ్మిరల్ గోర్ష్కోవ్ యుద్ధనౌకలోనే అత్యాధునిక జిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణులు, దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు ఉన్నాయి.. ధ్వనివేగం కన్నా అవి 5 రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లి దాడులు చేస్తాయి..వాటిని గుర్తించి అడ్డుకొండం చాలా క్లిష్టతరమైన విషయం..ఇటువంటి ఆయుధాలు రష్యాను కాపాడతాయని,,బయటి నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థంగా ఎదుర్కొంటాయని పుతిన్ వ్యాఖ్యనించారని వార్తలు వచ్చాయి..