AMARAVATHIPOLITICS

రాష్ట్రంలో 22 శాతం వున్న ఎస్సీ ఎస్టీల ప్రజలు నేటికి న్యాయం జరగకపోవడం దారుణం-పవన్

అమరావతి: సమాజంలో అణగారిన వర్గాలు ఆయిన ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను సక్రమంగా అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు..బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ సబ్ ప్లాన్ అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య ధొరణన్ని అయన తీవ్రంగా విమర్శించారు..రాష్ట్రంలో దాదాపు 22 శాతం ఎస్సీ ఎస్టీల ప్రజలు ఉన్నా వారికి నేటికి న్యాయం జరగక పోవడం దారుణమన్నారు.. రాష్ట్రంలో మూడేళ్లలో 20 వేల కోట్లు ఎస్సీ ఎస్టీ నిధులు రాకుండా చేశారంటే ఏమనుకోవాలి,,రాష్ట్ర ప్రభుత్వం పబ్లిసిటీ కోసం 15 వేల కోట్లు ఖర్చు చేయడం చూస్తుంటే,, ఎస్సీ ఎస్టీల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ది ఏ పాటిదో అర్ధంమౌతుందన్నారు..బాధితులకు వచ్చే పరిహారంలో కూడా వాటా అడిగే పరిస్థితి రాష్ట్రంలో ఉందని,,అలాంటి పరిస్థితి మారాలని అన్నారు..తమన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సి ఉందని,,సామాజిక పునర్నిర్మాణం చేయాలనే తపన నాలో వుందంటూ జనసేనాని వెల్లడించారు..ఏ పథకంను అయిన సరైన దిశలో ఆచరణలో పెట్టకపోతే ఎన్ని చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండదన్నారు..నమ్మిన సిద్దాంతం కోసం నిలబడి ఉండే వాడే నాయకుడని,,ఇదే సమయంలో బయట శత్రువులు కన్నా మనతోపాటు ఉండే శత్రువులు చాలా ప్రమాదకరం అని,,అలాంటి వారిని కనిపెట్టాల్సిన బాధ్యత వుందన్నారు..తొలుత ఇంద్రకీలాద్రి నుంచి మంగళగిరి వరకు వారాహి పై జనసేనాని ర్యాలీగా రాగా కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ నుంచి అభిమానులు జనసేనానిపై పూల వర్షం కురిపించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *