వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడతాయి-కలెక్టర్

నెల్లూరు: కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని, ఇతర దేశాల కంటే మనం ఏమాత్రం తక్కువ కాదని, అన్ని రంగాల్లో మన దేశం అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు..శనివారం నగరంలోని దర్గామిట్ట జిల్లాపరిషత్ బాలుర హైస్కూల్లో జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్,మేయర్ స్రవంతితో కలిసి మంత్రి ప్రారంభించారు..సైన్స్ ఫెయిర్లలో బహుమతులు పొందడం కంటే పాల్గొనడం చాలా ముఖ్యమని, ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలని మంత్రి కాకాణి అన్నారు..రోజువారి మానవ జీవితంలో సైన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని, సైన్స్ గొప్పతనాన్ని తెలుసుకొని విద్యార్థులందరూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని మంత్రి పిలుపునిచ్చారు..అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించి, వాటి వివరాలను మంత్రి, కలెక్టర్ అడిగి తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు.