హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్ర మరో సీనియర్ నటుడిని కొల్పొయింది..శుక్రవారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో కైకాల.సత్యనారాయణ (87) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతేడాది కోవిడ్ బారిన పడిన తరువాత కైకాల అనారోగ్యానికి గురైనట్లు తమ్ముడు కైకాల.నాగేశ్వర రావు చెప్పారు. కైకాల అంత్యక్రియలను శనివారం మహాప్రస్థానంలో నిర్వహిస్తామని వెల్లడించారు. అభిమానుల సందర్శనార్థం ఉదయం 11 నుంచి కైకాల పార్థీవదేహాన్ని ఉంచుతామన్నారు..
కైకాల.సత్యనారాయణ 60 ఏళ్ల సినీజీవితంలో దాదాపు 777కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.కైకాల సత్యనారాయణ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్ ఇలా అన్నీ రకాల ప్రాతలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా కైకాల,,నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్.వి.రంగారావు తరువాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు.
కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. గుడివాడ,, విజయవాడలో విద్యాభ్యాసం చేశారు.1960లో కైకాలకు,,నాగేశ్వరమ్మల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు,ఇద్దరు కూమారైలు..1959లో సిపాయి కూతురు సినిమా ప్రపంచంలో అడుగు పెట్టారు..ముఖ్యంగా యుముడి పాత్రతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.