AMARAVATHIDISTRICTS

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన..

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న చోట ఓటరు అసిస్టెంట్‌ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరి నారాయణన్‌ పేర్కొన్నారు. శనివారం  ఉదయం నెల్లూరు సిటీ, రూరల్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలు, కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో పోలింగ్‌ మెటీరియల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. తొలుత నెల్లూరు నగరంలోని డికెడబ్ల్యూ కళాశాలలో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను కలెక్టర్‌ పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కళాశాలలో  డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను పరిశీలించి, పోలింగ్‌ విధులకు హాజరయ్యే పోలింగ్‌ అధికారులు, సిబ్బందికి అందజేయనున్నఈవీఎంలు, పోలింగ్‌ మెటీరియల్‌ మొదలైన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పోలింగ్‌ సిబ్బందికి పోలింగ్‌ మెటీరియల్‌ను అందించాలని సూచించారు. అనంతరం మాగుంట లేఅవుట్‌లోని  ఎస్‌ఆర్‌కె హైస్కూల్‌, మూలాపేటలోని వేద సంస్క ృత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన  పోలింగ్‌ కేంద్రాల్లో మౌలికవసతులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.          ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న చోట ఓటర్లకు సహాయం చేసేందుకు ఓటరు అసిస్టెంట్‌ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నామని,  మే 13న ప్రజలందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్‌ చెప్పారు.

చెక్‌పోస్టుల వద్ద ఇతర రాష్ట్రాల, జిల్లాల ఓటర్లను అనుమతించండి:- నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా   మే 13న ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే ఓటర్లను చెక్‌పోస్టుల వద్ద ఇబ్బందులు లేకుండా అనుమతించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరి నారాయణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లు వారి వారి నియోజకవర్గాలకు వెళ్లి ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించాలని అధికారులకు సూచించారు. ఓటర్లు కూడా వారి వద్ద వున్న గుర్తింపు కార్డులను చెక్‌పోస్టుల వద్ద అధికారులు చూపించి సహకరించాలన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *