x
Close
DISTRICTS POLITICS

చంద్రబాబు బహిరంగ సభలో అపశృతి ఏడుగురి మృతి

చంద్రబాబు బహిరంగ సభలో అపశృతి ఏడుగురి మృతి
  • PublishedDecember 28, 2022

మరో ఐదు మంది పరిస్థితి విషమం..

నెల్లూరు: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుజిల్లా కందుకూరు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో గుండంకట్ట ఔట్‌లెట్‌ కాలువలో కార్యకర్తలు జారిపడిపోయారు.ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా,,మరో 5 గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నాకే ప్రసంగం చేస్తానంటూ కార్యక్రమాన్ని నిలిపేసి చంద్రబాబు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు..తొక్కసలాటలో కార్యకర్తల మరణం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.