కలెక్టరేట్ ఏ.ఓగా బాధ్యతలు స్వీకరించిన షఫీమాలిక్

నెల్లూరు: కలెక్టరేట్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ గా శనివారం ఎస్.కే.షఫీమాలిక్ బాధ్యతలు స్వీకరించారు.1985లో రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా విధుల్లో చేరిన అయన, విధి నిర్వహణలో ఎక్కవ భాగం కలెక్టర్ కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేశారు.సౌమ్యుడిగా పేరున్న షఫీమాలిక్ కు వివిధ విభాగలపై మంచి ఆవగాహన వుండడంతో ఈయనను, కలెక్టర్ ఏ.ఓ గా నియమించారు.బాధ్యతలు స్వీకరించిన ఏ.ఓ షఫీమాలిక్ కు ఉద్యోగులు పుష్పగుచ్చలు అందించి,అభినందలు తెలిపారు.