తుది శ్వాస విడిచిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి

అమరావతి: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సుదీర్ఘకాలం కృషి చేసిన స్వామి స్వరూపానంద సరస్వతి(99) అస్వస్థతతో ఆదివారంనాడు పరమపదించారు.. స్వరూపానంద సరస్వతి మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లోని శ్రీథామ్ జోతేశ్వర్ అశ్రమ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలోని దిఘోరీ గ్రామంలో 1924 సెప్టంబరు 2వ తేదిన జన్మించిన శంకరాచార్య స్వామి 2018లో బృందావనంలో, పరమేశ్వరుడు పార్వతీ దేవిని భార్యగా స్వీకరించిన రోజుకు గుర్తుగా ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకొనే హరియాలి తీజ్ రోజున ఆయన తన 99వ పుట్టినరోజు జరుపుకొన్నారు..సియోని జిల్లా జబల్‌పూర్ సమీపంలోని డిఘోరి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శంకరాచార్య, 9వ సంవత్సరంలోనే ఇంటిని విడిచిపెట్టి,,హిందూమత ఉద్ధరణ కోసం జీవితంను అంకితం చేశారు..యూపీలోని వారణాసి చేరుకుని స్వామి కర్పత్రి మహరాజ్ వద్ద వేదాలు అభ్యసించారు.. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు..19 సంవత్సరాల వయస్సులో స్వాతంత్య్ర పోరాటంలో దూకిన విప్లవ సాధువుగా పేరు తెచ్చుకున్నారు..1950లో దండి సన్యాస దీక్ష చేపట్టిన ఆయన స్వామి స్వరూపానంద సరస్వతిగా ప్రసిద్ధి చెందారు.ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు.