జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు-పరిస్థితి విషమం

అమరావతి: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (67) పశ్చిమ జపాన్ లోని నారా సిటీలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా,గుర్తు తెలియని దుండగుడు(41) వెనుక నుంచి ఛాతీపై రెండు సార్లు కాల్పులు జరపడంతో కుప్పుకూలినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి శుక్రవారం ప్రకటించారు..షింజో అబే తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు..పడిన వెంటనే ఎటువంటి రియాక్షన్ కనబరచలేదని,,పల్మనరీ కార్డియాక్ అరెస్ట్ కు గురై ఉండొచ్చని టోక్యో మాజీ గవర్నర్ పేర్కొన్నారు.. షూటర్‌గా భావిస్తున్న ఒక వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు..మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది” అని జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ హిరోకాజు మట్సునో తెలిపారు..జపాన్‌లో తుపాకీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ కాల్పులు చాలా అరుదుగా నమోదవుతుంటాయి.జపాన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి షింజో అబే, 2006లో ఒక సంవత్సరం పాటు పదవిలో కొనసాగారు. మళ్లీ 2012 నుంచి 2020 వరకు పదవిలో ఉన్నారు..