నెల్లూరు: ప్రతి విద్యార్ధి చదువుతో పాటు క్రీడల్లో పాల్గొని అనుకున్న లక్ష్యాలను సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా కల్లెకర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అన్నారు..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – హర్ ఘర్ తీరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడా సాధికార సంస్థ ఆద్వర్యంలో (శుక్రవారం) 12వ తేదీన నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు శనివారం ఉదయం స్థానిక ఎ.సి సుబ్బారెడ్డి స్టేడియంలోకలెక్టర్ చక్రధర్ బాబు బహుమతులు, సర్టిఫికెట్స్ ప్రదానం చేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్-హర్ ఘర్ తీరంగా కార్యక్రమం,అంతర్జాతీయ యువజన ఉత్సవం పురస్కరించుకుని జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 666 మంది క్రీడాకారులు కబడ్డీ, ఖో ఖో , వాలీబాల్, స్విమింగ్, బ్యాట్మింటన్ పోటీల్లో పాల్గొనడం జరిగిందన్నారు.ఈ క్రీడలను ఘనంగా నిర్వహించిన జిల్లా స్పోర్ట్స్ అధారిటి అధికారులను, పిఈటిలను, కోచ్ లను, క్రీడల్లో పాల్గొన్న విద్యార్ధులను జిల్లా కలెక్టర్ అభినందించారు..ఈ కార్యక్రమంలోనుడా విసి నందన్ ఓబులేసు, డిఆర్డిఏ, డ్వామా పిడి సాంబశివా రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, సెట్నల్ సి.ఈ.ఓ పుల్లయ్య, క్రీడా కోచ్ లు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.