సింగపూర్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్స్ కు చేరుకున్న సింధు

అమరావతి: సింగపూర్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు వరుస విజయాలతో దూసుకుపోతుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి,, వరల్డ్ 38వ ర్యాంకర్ సయినా కవకామిపై 21-15, 21-7తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది..తొలి సెట్ నుంచే ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం సాధించిన సింధు,,,కేవలం 32 నిమిషాల్లోనే గేమ్‌ను ముగించింది. సింగపూర్ ఓపెన్ గెలిచి తొలి సూపర్ 500 టైటిల్ సాధించాలని పట్టుదలతో వున్నది..