అమరావతి: దేశ రాజధానిలో 2 వేలకుపైగా తూటాలను ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు..దక్షిణ ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతం మీదుగా తూటాలతో వున్న రెండు బ్యాగ్ లను తీసుకుని వెళ్తుండగా వారిని పోలీసులు అరెస్టు చేశారు..మరో మూడు రోజుల్లో స్వాతంత్ర్య దినొత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ఉంది..దేశ రాజధాని నగరమంతా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు..ఈనేపథ్యంలోనే తనిఖీలు నిర్వహిస్తుండగా బుల్లెట్లను తరలిస్తున్న వ్యక్తులు దొరికిపోయారని,,అయితే వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు ? ఎందుకు తరలిస్తున్నారు ? అనేది తెలియాల్సి ఉందని ఈస్ట్ ఢిల్లీ రేంజ్ ACP విక్రమ్ జిత్ సింగ్ తెలిపారు..ఆ ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారమన్నారు.