జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులకు ఆరు రాష్ట్ర స్థాయి అవార్డులు

నెల్లూరు: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు-2022 పురస్కరించుకొని, రాస్ట్రంలో ఉభయ గోదావరి,నెల్లూరు జిల్లాలో వరదలలో సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులకు,సహాయ సిబ్బందికి రాస్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉత్తమ పశు సంవర్ధక సేవలు అందించిన పశు వైద్యులకు రాష్ట్ర స్తాయి ఉత్తమ సేవ పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ పశు సంవర్ధక,మరియు మత్యశాఖ మంత్రి డాక్టర్ సిదిరి.అప్పలరాజు,వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి పూనమ్.మాలకొండయ్య,పశుసంవర్ధకశాఖ సంచాలకు డాక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్ ముఖ్య అతిధులుగా పాల్గొని నెల్లూరుజిల్లా పశుసంవర్ధక శాఖకు ఆరు అవార్డులు ప్రధానం చేశారు.అవార్డు గ్రహీతలైన జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్.బి.మహేశ్వరుడు,కందుకూరు ఉప సంచాలకులు డాక్టర్.కె.సి.హెచ్.వి.చంద్ర శేఖర్, ఆత్మకూరు ప్రాంతీయ పశు వైద్య శాల సహాయ సంచాలకులు డాక్టర్.యస్.జయచంద్ర,పశువైద్యులు డాక్టర్.ఎ.రామ చంద్రరెడ్డి,పెనుబల్లి గ్రామీణ పశు వైద్యశాల,వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ ఆర్.శ్రీనివాసులు,శ్రీ పురందర పురం రైతు భరోసా కేంద్ర పశు సంవర్ధక సహాయకులు వింజమూరు మనోజ్ కుమార్ లకు ఈ అవార్డులను మంత్రి అందించారు.