x
Close
CRIME HYDERABAD

హైదరాబాద్ పెట్రోల్ బంకులో స్మార్ట్ మీటర్ మోసం

హైదరాబాద్ పెట్రోల్ బంకులో స్మార్ట్ మీటర్ మోసం
  • PublishedNovember 17, 2022

హైదరాబాద్: రాష్ట్రం వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకులు వాహనదారులను మోసం చేస్తున్నే వున్నాయి.ఇలా మోసాలు బయటపడినప్పడు కొన్ని బంకులను అధికారులు సీజ్ చేస్తుంటే,మరి కొన్ని బంకులు రాజకీయ నాయకులను నుంచి అధికారులపై ఒత్తిడి తీసుకుని వచ్చి,మళ్లీ బంకులు ఓపెన్ చేసి మోసాలతో నడిపిస్తున్నారు.తాజాగా స్మార్ట్ మోసం బయటపడింది. కొందరు బంకు యజమానులు పెట్రోల్ ను పంప్ చేసి మీటరు రీడింగ్ మెషీన్ వద్ద ఎలక్ట్రానిక్ చిప్ లను అమర్చి పెట్రోల్ పోస్తూ, వాహనదారులను నిలువున దొచుకుంటున్నారు.రంగారెడ్డి జిల్లాలో వినియోగదారులను మోసం చేస్తున్న ఓ పెట్రోల్ బంకు నిర్వాకం బయటపడింది. రాజేంద్రనగర్ సర్కిల్ లోని 313 ఫిల్లర్ వద్ద వున్న GYS రెడ్డి ఫిల్లింగ్ స్టేషన్,ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో చిప్ అమర్చి మోసం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 5 లీటర్ల పెట్రోల్ పోసుకుంటే దాదాపు 500 ml పెట్రోల్ తక్కువగా వస్తున్నట్లు కొంతమంది వాహనదారులు గమనించి, అధికారులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందుకున్న తూనికలు, సివిల్ సప్లై అధికారులు, SOT పోలీసుల సహయంతో పెట్రోల్ పంపులో ఆకస్మిక తనిఖీలు చేశారు. బంకులోని మీటర్ రీడింగ్ మెషీన్లలో ఏర్పాటు చేసిన చిప్ తో పాటు మెమరీ కార్డుని స్వాధీనం చేసుకున్నారు. పెట్రోల్ బంకు యజమానిపై కేసు నమోదు చేసి,వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

జాగ్రత్తలు:-1- పెట్రోల్ బంకుల్లో ఫ్యుయ‌ల్ నింపే స‌మ‌యంలో కొందరు వర్కర్లు ప‌దే ప‌దే ఫ్యుయ‌ల్ నాజిల్‌ను ప్రెస్ చేస్తూ ఉంటారు. మనం రీడింగ్ పై దృష్టి పెడతాం కాబట్టి ఇది పెద్దగా పట్టించుకోం. నాజిల్‌ను అలా ప్రెస్ చేయడం వలన ఫ్యుయ‌ల్ మ‌న‌కు త‌క్కువ‌గా వ‌స్తుంది. కారు ఇలాంటి వాహనాలకు పెట్రోల్ పొయించుకునే సమయంలో  చాలా మంది కారు దిగరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ పెట్రోల్ దొంగతనం జరుగుతుంది. కాబట్టి కారు దిగి రీడింగ్ వైపు నాజిల్‌ పైపు చూసుకోవాలి.

2-ఈ స్మార్ట్ చిప్ ల వల్ల మీటరు రీడింగ్ లో కొన్ని సార్లు జంప్ అవుతుంటాయి.మెషీన్ లోపల వున్న చిప్ వల్ల మీటరు రీడింగ్ బాగానే చూపిస్తున్నా? పైప్ నాజిల్ లను పదే పదే వదిలి పెట్రోల్ పడుతుండడంతో,లీటరుకు దాదాపు 50 ml నుంచి 100 ml నష్టపోతాం..

3-రౌండ్ ఫిగర్ అమౌంట్ కాకుండా, హర్డ్ ఫిగర్ అమౌంట్ కు పెట్రోల్ పొయించుకోవాలి..ఉదా:-రూ.100,,150,,200 ఇలా కాకుండా రూ.125,,170,,224.40 పైసా అంటే 2 లీటర్లు..ఇలా చేస్తే కొంతలో కొంత సేవ్ అయ్యే అవకాశం వుంటుంది.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *