సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత

అమరావతి: బ్రెజిల్ పూట్ బాల్ దిగ్గజం,,ఫుట్ బాల్ అత్యుత్తమ క్రీడాకారుడు పీలే (82) అనారోగ్యం బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు..గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న పీలే సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..ఈ విషయాన్ని పీలే కూమారై దృవీకరించారు.. క్యాన్సర్ బారిన పడిన పీలేకు గత సంవత్సరం సెప్టెంబర్ లో వైద్యులు పెద్దపేగులో క్యాన్సర్ కణతిని తొలగించారు.. అప్పటి నుంచి ఆయనకు కీమో థెరపీ చికిత్స అందిస్తున్నారు..ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. పీలేకు ఊపరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. పీలే పలు అవయవాలు పని చేయకపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
అక్టోబర్23, 1940లో పీలే జన్మించారు. బ్రెజిలో లోని ట్రెస్ కొరాకోస్ లో ఆయన జన్మించారు. పీలే అసలు పేరు ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో.. 1958,,962,,1970 ప్రపంచకప్ విజయాల్లో ఆయన భాగస్వామి అయ్యారు. ఫార్వర్డ్ గా, అటాకింగ్ మిడ్ ఫీల్డర్ గా ఆటలో అధ్భుతమైన షాట్స్ ను కొట్టేవాడు..ఫుట్ బాల్ ప్రపంచకప్ లో ఆడిన 14 మ్యాచుల్లో పీలే 12 గోల్స్ సాధించారు.1971 జులైలో యుగోస్లేవియాతో ఆయన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.