హైదరాబాద్: మళ్లీ బ్యాక్ డోర్ ద్వారా సాప్ట్ వేర్ కంపెనీలో చేరాలి అనుకునే,యువతి,యువకులు మోసపోయారు.హైటెక్ సీటీ ప్రాంతంలోని మాదాపూర్ లో డాన్యోన్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాదాపు 200 మంది ఔత్సహకుల నుంచి రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. డాన్యోన్ ఐటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్ గా ప్రతాప్ అనే వ్యక్తి వ్యవహరిస్తున్నాడు.కాల్ లెటర్స్ ఇచ్చిన ప్రతాప్ అపాయింట్ అడిగే సరికి ఫోన్ లిప్ట్ చేయడం మానివేశారు.దింతో అతనికి అనుమానం రాకుండా,మరి కొంత మంది ఉద్యోగం కోసం సిద్దంగా వున్నరని బాధితులు ఫోన్ చేయడంతో వారితో మాట్లాడేందుకు వీరి వద్దకు వచ్చిన ప్రతాప్ ను పట్టుకుని,మాదాపూర్ పోలీసులకు బాధితులు అప్పగించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.