త్వరలోనే వాట్సాప్ ‘కాల్ లింక్స్’ అడ్వాన్స్ డ్ ఫీచర్ బీటా వెర్షన్

అమరావతి: వాట్సాప్ మరో అడ్వాన్స్ డ్ ఫీచర్ బీటా వెర్షన్ ను త్వరలోనే వాట్సాప్ ప్రారంభించనుంది.‘కాల్ లింక్స్’ పేరుతో ప్రవేశ పెట్టనున్నఈ లింక్ ను గరిష్ఠంగా 32 మందికి షేర్ చేసి, దాని ద్వారా ఒకేసారి 32 మందితో వీడియో కాల్ లో మాట్లాడొచ్చు. వాట్సాప్ యాప్ లేని వారు కూడా ఈ లింక్ ద్వారా వీడియో కాల్ కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని ఫేస్ బుక్ గ్రూప్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ వెల్లడించారు.ఈ వారంలోనే ‘కాల్ లింక్స్’ ఫీచర్ ను ప్రయోగాత్మకంగా కొంతమంది వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ ఫీచర్ ను ఉపయోగించాలంటే వాట్సాప్ కొత్త వర్షన్ కు అప్ డేట్ కావాల్సి ఉంటుంది..