మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షడు గొటబాయ రాజపక్సే

అమరావతి: తీవ్ర ఆర్దిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి.. ప్రజల ఆగ్రహం చూసి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే బుధవారం వేకువజామునే కుటుంబంతో సహా దేశం విడిచి, మాల్దీవులకు పారిపోయాడు..విషయం తెలుసుకున్న ప్రజలు ఉదయం నుంచే మళ్లీ రోడ్డెక్కారు..కొలంబోలోని తాత్కలిక ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసం వైపు వేల మంది ర్యాలీగా బయల్దేరారు..ఉద్రికత్త పరిస్థితులను గమనించి,,దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు తాత్కలిక ప్రధాని రణిల్ విక్రమసింఘే బుధవారం ప్రకటించారు..కొలంబో సహా పశ్చిమ ప్రావిన్స్ లో నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు..ఆందోళనకారులను అరెస్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు..ఇదే సమయంలో తాను, తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు..మాల్దీవులకు పారిపోయిన గొటబాయ రాజపక్స తక్షణమే రాజీనామా చేయాలని శ్రీలంకవాసులు డిమాండ్ చేస్తూ రోడ్లెక్కారు..ప్రధానమంత్రి కార్యాలయాన్ని చుట్టుముట్టారు..ఆందోళనకారులు, ప్రధాని కార్యాలయం ఆవరణ నుంచి వెళ్లిపోవాలని భద్రతా బలగాలు హెచ్చరించాయి..దీంతో భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి..గుంపులు గుంపులుగా వస్తున్న ప్రజలను చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలను బలగాలు ప్రయోగించారు.
పారిపోయిన రాజపక్సే:-మిలటరీ విమానంలో, అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి,,మిలిటరీ విమానంలో మాల్దీవులు పారిపోయారు..ఆ తరువాత కొంతసేపటికి,మాల్దీవులోని, మాలే నగరంలోని వెలానా ఎయిర్‌పోర్టులో ఆయన ప్రత్యక్షమయ్యారు..గొటబాయతోపాటు ఆయన సతీమణి, ఇద్దరు బాడీగార్డులు వెంటవున్నారు..మాలేలోని ఎయిర్‌పోర్టులో దిగాక పోలీస్ ఎస్కార్ట్ తో రహస్య ప్రాంతానికి తరలించారు..