3 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశ పెట్టిన SSLV-D2 రాకెట్

అమరావతి: తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి SSLV-D2 రాకెట్, 334 కిలోల బరువుండే 3 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది..శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం వేకువజామున 2.48 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది..6.30 గంటలపాటు కౌంట్ డౌన్ అనంతరం 9.18 గంటలకు షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి SSLV-D2 నింగిలోకి దూసుకెళ్లింది..SSLV-D2 రాకెట్ ద్వారా ఇస్రో రూపొందించిన 156.3 కిలోల బరువైన భూ పరిశీలన ఉపగ్రహం EOS-07,, స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మన దేశ విద్యార్థినులు రూపొందించిన 8.7కిలోల బరువైన ఆజాదీ శాట్-02 ఉపగ్రహం,, అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువున్న జానూస్-01 ఉపగ్రహాలను భూమి చుట్టూ 450 కిమీ వృత్తాకార కక్ష్యలోకి పంపారు.. గత సంవత్సరం ఆగస్టు 7వ తేదిన ప్రయోగించిన SSLV తొలి రాకెట్ చివరి నిమిషంలో ఉపగ్రహాల నుంచి సంకేతాలు అందకపోవడంతో విఫలమైంది..
మార్చి నెలలో LVM.3 రాకెట్ ప్రయోగం ద్వారా 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు సిద్ధమౌవుతున్నమని,, ఏప్రిల్ నెలలో మరో SSLVతో పాటు మే నెలలో గగన్ యాన్ ప్రయోగాత్మక లాంచ్ ఉండబోతున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు..ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్ లో భారత్ దూసుకుపోతుంది..తక్కువ ఖర్చుతో ప్రపంచ దేశాలుకు సంబంధించిన చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రో సాధిస్తొంది.
#UPDATE | SSLV-D2/EOS-07 Mission is accomplished successfully. SSLV-D2 placed EOS-07, Janus-1, and AzaadiSAT-2 into their intended orbits: ISRO
— ANI (@ANI) February 10, 2023