AMARAVATHIDISTRICTS

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ తెలిపారు. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్‌ పాల్గొంటారు. ఈనెల 22వ తేదీ ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 10.40 గంటలకు నెల్లూరు పోలీసు పరేడు మైదానానికి గవర్నర్‌ చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు విక్రమసింహపురి యూనివర్శిటీలో నిర్వహించే స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్‌ పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.35 గంటలకు పోలీసుపరేడు మైదానం నుంచి హెలికాప్టర్‌:లో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *