AMARAVATHIDISTRICTS

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం..
అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును విని యోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఖండించారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
వెబ్ కాస్టింగ్:-నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎన్నికల ప్రక్రియను వివిధ ఎన్నికల పరిశీలన బృందాల అధికారులతో పాటు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోని వెబ్ కాస్టింగ్ ద్వారా వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించి,,రేపు ఉదయం 7 గంటలకు మొదలుకానున్న పోలింగ్ కు సంబంధించి చేపట్టాల్సిన పలు అంశాలపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *