అమరావతి: బాలీవుడ్ టీవీ నటుడు ఆనంద్ వీర్ సూర్యవంశీ(46) శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలి మరణించాడు.వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆతను మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సిద్ధాంత్ వీర్ సూర్యవంశీగా పాపులర్ అయిన యువ నటుడు,కసౌథీ జిందగీ కే సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న సిద్దాంత్ పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడు. కృష్ణా అర్జున్, క్యా దిల్ మే హై, కోయీ హై, సూఫియానా మేరా ఇష్క్ హై సీరియల్స్‌లో సిద్ధాంత్ నటించాడు. క్యూ రిస్తో మే కట్టీ బట్టీ, జిద్దీ దిల్ లు ఇతని చివరి టీవీ షో ప్రాజెక్టులు. సిద్ధాంత్ భార్య సూపర్ మోడల్ అలేషియా రౌత్,వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిద్దాంత్ ఎప్పుడు ఫిట్ గా ఉండడం కోసం జిమ్ లో నిత్యం కసరత్తులు చేస్తుండే వాడు. సిద్దాంత్ మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు, అతడి సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.