రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసిన సుందర్ పిచాయ్

అమరావతి: భారతదేశంకు వచ్చిన గూగుల్, ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో ముర్ముతో, గూగుల్ ఫర్ ఇండియా 2022 ఈవెంట్ గురించి ఆయన వివరించారు..రాష్ట్రపతికి, గూగుల్ ఈవెంట్ డాక్యూమెంట్ ను అందజేశారు..ముర్ముతో పిచాయ్ దిగిన ఫొటోలను రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. భారతీయుల తెలివితేటలు,, నైపుణ్యానికి సందర్ పిచాయ్ నిదర్శనమని రాష్ట్రపతి అన్నారు..భారతదేశంలో అంతర్జాతీయ డిజిటల్ అక్షరాస్యత కోసం కృషి చేయాలని రాష్ట్రపతి సుందర్‌ను కోరారు..నేడు గూగుల్ ఫర్ ఇండియా 2022 కార్యక్రమాన్ని గూగుల్ సంస్థ నిర్వహిస్తోంది.